ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్ష 

11 Jul, 2021 00:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నడుంబిగించింది. ఉద్యోగం లేక నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ తెలిపారు.

శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె పార్టీ అడహక్‌ కమిటీ సభ్యులు పిట్టా రాంరెడ్డి, భూమిరెడ్డి, సాహితీ, ఆయూబ్‌ ఖాన్, కృష్ణమోహన్‌ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్‌ 15 నుంచి 72 గంటల పాటు షర్మిల దీక్ష చేసినప్పటికీ ప్రభుత్వంలో స్పందన కానరాలేదన్నారు. కేవలం ఎన్నికల సమయంలో వరాలు కురిపించే సంస్కృతిని మాని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో ఉద్యోగ నోటిఫికేషన్‌ కేలండర్‌ రూపొందించాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు