ఇది మారాలి.. మీరు మార్చాలి: వైఎస్‌ షర్మిల

23 Mar, 2021 01:41 IST|Sakshi
లోటస్‌పాండ్‌లో వైఎస్‌ షర్మిలకు ఇమామి జామీన్‌ కడుతున్న చిన్నారి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైఎస్‌ షర్మిల మండిపాటు.. 

వివిధ జిల్లాల ముస్లిం నేతలు, కార్యకర్తలతో సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని, కేంద్ర పాలకులు మాత్రం హేట్‌బ్యాంకుగా చూస్తున్నారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల ఆరోపించారు. ‘ఇది మారాలి.. మీరు మార్చాలి. రాజన్న బిడ్డగా మీ పక్షాన పోరాటం చేయడానికి నేను సిద్ధం. మనం చేయి చేయి కలిపితే మళ్లీ రాజన్న సంక్షేమ పాలన సాధ్యమని నేను గట్టిగా నమ్ముతున్నాను’అని పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముస్లిం నేతలతో సోమవారం లోటస్‌పాండ్‌లో షర్మిల సమావేశమయ్యారు.

‘నేను వైఎస్సార్‌ కూతురిని. మీ అందరి కూతురిని. వైఎస్సార్‌కు ముస్లింలు అంటే ప్రత్యేకమైన అభిమానం. 4 శాతం రిజర్వేషన్లతో ముస్లింలు అనేక ఉద్యోగాలు సాధించుకున్నారు. ప్రీ మెట్రిక్, పోస్టుమెట్రి క్‌ స్కాలర్‌షిప్‌ ఇచ్చారు’అని వివరించారు. వక్ఫ్‌బోర్డు భూములు ఆక్రమణలకు గురైతే వాటిని వైఎస్సార్‌ వెనక్కి తెచ్చారని షర్మిల పేర్కొన్నారు. పాతబస్తీ అభివృద్ధి కోసం రూ.2 వేల కోట్లు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, డ్రైనేజీ సమస్య లేకుండా చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రగతిలో ముస్లింల పాత్రను మరవలేమని, వారులేని తెలంగాణ సమాజాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో ముస్లింల బతుకులేమైనా మారాయా అని పశ్నించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు