అధికారమిస్తే రుణమాఫీ, సున్నావడ్డీకే రుణాలు: వైఎస్‌ షర్మిల

13 Oct, 2022 05:02 IST|Sakshi

సాక్షి, నిజాంసాగర్‌: తమకు అధికారమిస్తే పంట రుణాలు మాఫీ చేస్తా మని, సున్నావడ్డీకి రుణాలు ఇస్తామని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షు రాలు వైఎస్‌ షర్మిల హామీ ఇచ్చారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం మండలాల మీదుగా సాగింది. పిట్లంలో ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్‌ సర్కార్‌ రూ.వేల కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.

అక్రమంగా సంపాదించిన డబ్బు లతో సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ కొనుగోలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అభివృద్ధిని విస్మరించి దేశాన్ని దోచుకునేందుకు కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ అందించిన సువర్ణ పాలన కోసం తమ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు