ఉపాధ్యాయుడి పాత్ర మ‌రువ‌లేనిది: వైఎస్‌ షర్మిల

5 Sep, 2021 15:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ కార్యాల‌యంలో ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వహించారు. ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల‌కు విద్యాబుద్ధుల‌తో పాటు క్రమ‌శిక్షణ నేర్పి, భ‌విష్యత్‌లో మంచివైపు న‌డిపించే వ్యక్తి గురువు ఒక్కరేన‌న్నారు. అన్ని వృత్తులను త‌యారు చేసే వృత్తి.. ఉపాధ్యాయ వృత్తి మాత్రమేనని తెలిపారు. భావిత‌రాల‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడి పాత్ర మ‌రువ‌లేనిద‌న్నారు.

చదవండి: నా బిడ్డలిద్దర్నీ ఆశీర్వదించండి

మాన‌వ‌త్వానికి మరో రూపం మదర్ థెరిస్సా
నోబెల్ అవార్డు గ్రహీత మ‌దర్ థెరిస్సా వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆమె చిత్రప‌టానికి వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు పూల‌మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. ఎంద‌రో నిరాశ్రయులు, శ‌ర‌ణార్థులు, అంటువ్యాధిగ్రస్తులను చేర‌దీసి ఆశ్రయం క‌ల్పించిన మ‌ద‌ర్ థెరిస్సా జీవితం అంద‌రికీ స్ఫూర్తిదాయ‌కం అన్నారు. అంధులు, దివ్యాంగులు, వృద్ధుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించి, సేవామూర్తిగా నిలిచారని గుర్తు చేశారు. మాన‌వ‌త్వానికి మ‌రో రూపం మ‌ద‌ర్ థెరిస్సా అని కొనియాడారు.

చదవండి: యువతను బలిపీఠం ఎక్కిస్తున్నారు: వైఎస్‌ షర్మిల

మరిన్ని వార్తలు