వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల  

5 Jun, 2022 04:40 IST|Sakshi

తల్లాడ: రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైం దని.. హైదరాబాద్‌లో బాలి కపై అత్యాచారం ఘటనే ఇం దుకు ఉదాహరణ అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల అన్నారు. ఆమె చేస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివా రం ఖమ్మం జిల్లా తల్లాడ, ఏన్కూరు మండలాల్లో కొన సాగింది. తల్లాడ మండలం అన్నారుగూడెంలో ఆమె పాదయాత్ర 1,100 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు.

అనంతరం గ్రామంలో చేపట్టిన రైతు గోస దీక్షలో మాట్లాడారు. బాలికపై అత్యాచారం కేసులో హోంమంత్రి మనవడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారని తెలియడంతోనే వివరాలు బయటకు రాకుండా చూశారని ఆరోపించారు. ఘటన జరిగాక కొద్ది రోజులకు కేటీఆర్‌.. దోషులను శిక్షించాలని ట్వీట్‌ చేయడంతో ప్రభుత్వ పెద్దలకు మహిళలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు