పుల్లెంలలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష

27 Jul, 2021 21:01 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: దేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. చుండూరు మండలం పుల్లెంలలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్‌ (26) కుటుంబాన్ని మంగళవారం ఆమె పరామర్శించారు. అనంతరం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా  వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ, 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి ఎన్నో పథకాలను వైఎస్సార్‌ నాడు ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణలో ఎవరిని కదిలించినా అప్పులేనని, తెలంగాణలో ప్రతి కుటుంబం అప్పులపాలైందని విమర్శించారు. ఇళ్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని షర్మిల ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు