మెదక్‌: వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల

2 Jun, 2021 17:19 IST|Sakshi

సాక్షి,మెదక్: జిల్లాలోని వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో వైఎస్ షర్మిల బుధవారం ఉదయం పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకొని, ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నా.. ఎంతకు నోటిఫికేషన్‌ రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. డీఎస్సి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో వెంకటేష్ మే16న ఆత్యహత్య చేసుకున్నాడు.

వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ షర్మిల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం వెఎస్‌ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడిచినా ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో లేవన్నారు. నేడు తెలంగాణలో ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

నిరుద్యోగులు చనిపోవడం తెలంగాణ ఉద్యమానికి అవమానమని, 35 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని గుర్తుచేశారు.  నోటిఫికేషన్లు ఇవ్వకుండా పాలకులు మరణ శాసనాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఎంత మంది నిరుద్యోగులు చనిపోతే ఉద్యోగాలు ఇస్తారో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, మరి ప్రజల పిల్లలకు ఉద్యోగాలు వద్దా అని షర్మిల నిలదీశారు.

చదవండి: బ్లాక్‌ఫంగస్‌ బాధితుడికి కేటీఆర్‌ అండ..

మరిన్ని వార్తలు