కృష్ణంరాజు భార్యకు వైఎస్‌ విజయమ్మ పరామర్శ 

20 Sep, 2022 03:57 IST|Sakshi

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): మాజీ కేంద్రమంత్రి, విలక్షణ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల వైఎస్‌ విజయమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు. సోమవారం జూబ్లీ హిల్స్‌లో కృష్ణంరాజు సతీమణి శ్యామలతో పా టు కుటుంబ సభ్యులను విజయమ్మ పరామర్శించారు. కృష్ణంరాజుతో తన భర్త వైఎస్సార్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్‌ తరచూ కృష్ణంరాజు గొప్పతనం గురించి చెబుతుండేవారని గుర్తుచేసుకున్నారు. 
 

మరిన్ని వార్తలు