నా బిడ్డ షర్మిలను ఆశీర్వదించండి: వైఎస్‌ విజయమ్మ

9 Apr, 2021 20:47 IST|Sakshi

ఖమ్మం: ప్రియతమ నేత దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బాటలోనే ఖమ్మం నుంచి ప్రజలతో కలిసి నడిచేందుకు షర్మిల వచ్చిందని వైఎస్‌ విజయమ్మ అన్నారు. షర్మిలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలతో తమకున్న అనుబంధం చెరిగిపోనిదని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ని నాయకుడిగా నిలబెట్టిన ప్రజలకు తమ కుటుంబం రుణపడి ఉంది అని పేర్కొన్నారు. వైఎస్సార్‌ లేరన్న వార్తతో అనేక గుండెలు ఆగిపోయాయని గుర్తుచేశారు.

ఖమ్మం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సంకల్ప సభలో వైఎస్‌ విజయమ్మ పాల్గొని మాట్లాడారు. ‘‘ వైఎస్సార్‌ మనిషిని మనిషిగానే ప్రేమించారు. కుల, మత, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌‌ సంక్షేమ ఫలాలు అందించారు. కోటి ఎకరాలకు నీరందించేందుకు జలయజ్ఞం ప్రారంభించిన దమ్మున్న నాయకుడు వైఎస్సార్‌. వైఎస్సార్‌‌ పాలన ఒక స్వర్ణయుగం. కరెంటు బిల్లు అయినా, ఆర్టీసీ ఛార్జీలైనా ఏవీ పెంచలేదు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా లక్షల మంది ఆరోగ్యానికి మేలు చేశారు. ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే అయినా వైఎస్‌ఆర్‌ చలవే. నా బిడ్డ షర్మిలను మీ చేతుల్లో పెడుతున్నా.. ఆశీర్వదించండి’’ అని వైఎస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

చదవండి: డ్రగ్స్‌ ఎమ్మెల్యేలు, వసూల్‌ మంత్రిని తొలగించండి
చదవండి: లాక్‌డౌన్‌పై రేపు ముఖ్యమంత్రి ప్రకటన

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు