‘కాళేశ్వరం’ అబద్ధాల ప్రాజెక్టు 

23 Jul, 2022 03:10 IST|Sakshi
షర్మిలను అడ్డుకుంటున్న పోలీసులు  

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల 

లక్ష్మీపంప్‌హౌస్‌ సందర్శనను అడ్డుకున్న పోలీసులు

కాళేశ్వరం/సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వం మహాద్భుతమన్న కాళేశ్వరం ప్రాజెక్టు, అబద్ధాల ప్రాజెక్టు.. అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. శుక్రవారం ఆమె జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో కాళేశ్వరం ప్రాజె క్టులో భాగమైన అన్నారం (సరస్వతీ) బ్యారేజీని పార్టీ కార్యకర్తలతో కలసి సందర్శించారు. తర్వాత కన్నెపల్లిలోని లక్ష్మీపంప్‌హౌస్‌ పరిశీలనకు రాగా పోలీసులు అడ్డుకున్నారు.

షర్మిల కారు దిగి లక్ష్మీపంప్‌హౌస్‌కు వెళ్లేందుకోసం సీఐ కిరణ్‌కుమార్‌తో మాట్లాడారు. ఆయన ససేమిరా అనడంతో వాగ్వాదం జరిగింది. షర్మిల, పార్టీ కార్యకర్తలను పోలీసులు రోప్‌ పార్టీలతో అడ్డుకున్నారు. తరువాత రోడ్డుపై షర్మిల, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్‌ రూ.లక్షా 50 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి ప్రజాధనాన్ని వృథాచేసి డబ్బులు సంపాదించారని ఆరోపించారు.  కాగా, పెద్దపల్లి జిల్లా రామగుండంలోని న్యూపోరేడుపల్లి కాలనీవాసులను, మంథనిలో పంటలు నీటమునిగి ఇబ్బందులు పడుతున్న రైతులను ఆమె పరామర్శించారు. 

మరిన్ని వార్తలు