ఫైనాన్స్‌ కంపెనీలో చోరీ

27 Mar, 2023 01:32 IST|Sakshi

తిరుపతి క్రైమ్‌: నగరంలోని తిరుమల బైపాస్‌ రోడ్డులోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో చోరీ జరిగింది. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. క్రైమ్‌ పోలీసుల కథనం.. తిరుమల బైపాస్‌ రోడ్డులోని మూడవ అంతస్తులో స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ నిర్వహిస్తున్నారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి షట్టర్‌ తాళాలు పగలగొట్టి అందులో ఉన్న రూ.7.3లక్షలను దోచుకెళ్లారు. ఆదివారం బ్రాంచ్‌ మేనేజర్‌ జయప్రకాష్‌ కార్యాలయానికి వెళ్లి చూడగా షట్టర్‌ పగలగొట్టి ఉంది. వెంటనే డయల్‌ 100కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీం ద్వారా ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు