తెప్పపై తేజోమయుడు

27 Mar, 2023 01:32 IST|Sakshi
ముత్యపు పందిరి వాహనంపై..

పిచ్చాటూరు: నాగలాపురంలోని శ్రీవేదనారాయణ స్వామి సూర్యపూజ తెప్పోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి లక్ష్ముణ సమేత సీతారాముల ఉత్సవమూర్తులు తెప్పపై విహరిస్తూ కనువిందు చేశారు. అంతకుముందు మత్స్యమూర్తిగా వెలసిన శ్రీ వేదనారాయణస్వామి పాదాలపై స్పృశించాల్సిన సూర్యకిరణాలకు మబ్బులు అంతరాయం కలిగించాయి. ఉదయం స్నపన తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామి ఉత్సమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ముత్యపు పందిరి వాహనంపై ఆశీనులు చేసి పుష్కరిణికి వేంచేపు చేశారు. పుష్కరిణిలోని తెప్పపై స్వామి, అమ్మవార్లను ఆశీనులు చేసి తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను తిరువీధుల్లో మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు. చివరిగా రాత్రి నిజాలయంలో శ్రీ వేదనారాయణుడికి ఏకాంత సేవ నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ అధికారి పర్యవేక్షించగా, నాగలాపురం, సత్యవేడు, పిచ్చాటూరు ఎస్‌ఐలు హనుమంతప్ప, పురుషోత్తంరెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు