నేడు కలెక్టరేట్‌లో ‘స్పందన’

27 Mar, 2023 01:32 IST|Sakshi
రైతులతో సమావేశమైన అధికారులు (ఫైల్‌)

తిరుపతి అర్బన్‌ : ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి జిల్లాస్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఈ క్రమంలో తిరుపతి ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. అర్జీలు రాసేందుకు ముగ్గురు వీఆర్‌ఓలను నియమించినట్లు తెలిపారు. ప్రతి సచివాలయంలో కూడా స్పందన కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు.

ఏప్రిల్‌ 1న బాలకాండ అఖండ పారాయణం

తిరుమల:లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థి స్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఏప్రి ల్‌ 1వ తేదీన 15వ విడత బాలకాండ అఖండపారాయణం నిర్వహించనున్నట్లు టీటీడీ ఆదివారం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుందని వెల్లడించింది. ఎస్వీ వేద వి/్ఞాన పీఠం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, సంభావన పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొత్తం 114 శ్లోకాలను పారాయణం చేయనున్నట్లు వివరించింది.

‘సాగరమాల’కు భూసమస్య

చిల్లకూరు : కేంద్రప్రభుత్వం చేపట్టిన సాగరమాల ప్రాజెక్టుకు భూసమస్య ఏర్పడింది. వివరాలు.. చిల్లకూరు మండలం వరగలి క్రాస్‌ నుంచి తూర్పు కనుపూరు వరకు సుమారు 36.65 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి రూ 964.24 కోట్లతో శ్రీకారం చుట్టారు. ఇందుకు గాను 12 గ్రామాలలో సుమారు 370 ఎకరాల వరకు భూములు సేకరించాల్సి ఉంది. ఆయా భూములను గుర్తించినప్పసటికీ రైతులకు చెల్లించాల్సి పరిహారం విషయం ఓ కొలిక్కి రాలేదు. రెవెన్యూ అధికారులు ఎకరాకు రూ.11.30 లక్షలు మాత్రమే ఇస్తామని చెబుతుండడంతో రైతులు ముందుకు రావడం లేదు. మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.40లక్షలు పలుకుతుంటే, తక్కువ మొత్తానికి భూములు ఎలా అప్పగిస్తామని రైతులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు