గర్భాలయ ద్వారం రాతి శిలకు ప్రత్యేక పూజలు

28 Mar, 2023 01:44 IST|Sakshi
శిరోభాగంలో ఏర్పాటు చేసే రాతి శిల(ఇన్‌సెట్‌) పూజలు చేస్తున్న ఎమ్మెల్యే భూమన, మేయర్‌

తిరుపతి కల్చరల్‌: శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా అమ్మవారి గర్భాలయ సింహ ద్వారపు శిరోభాగంలో ఏర్పాటు చేసే గజలక్ష్మి అమ్మవారి ప్రతిమ కలిగిన రాతి శిలకు సోమవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్‌ డాక్టర్‌ శిరీషా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునఃనిర్మాణంలో ప్రతి రాయి అమ్మవారి రూపంతో సమానంగా పూజించి ప్రతిష్టించడం జరుగుతోంది. ఇందులో భాగంగా రాతి శిలకు పూజలు చేసిన అనంతరం అమ్మవారి గర్భాలయ సిమహద్వారంపై రాతి శిలను ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్‌ కట్టా గోపీయాదవ్‌, ఈఓ ఎం.మునిక్రిష్ణయ్య, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

హుండీ ఆదాయం రూ.23.35 లక్షలు

అమ్మవారి హుండీ లెక్కింపు ద్వారా రూ.23,35,036 ఆదాయం లభించింది. అలాగే 20 గ్రాముల 250 మిల్లీగ్రాముల బంగారం, 269 గ్రాముల 200 మిల్లీ గ్రాముల వెండిని భక్తులు కానుకగా సమర్పించారు.

మరిన్ని వార్తలు