గ్రీన్‌కోర్‌ టీచర్స్‌కు అభినందనలు

28 Mar, 2023 01:44 IST|Sakshi

తిరుపతి అర్బన్‌: గ్రీన్‌ కోర్‌ టీచర్స్‌ను కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి అభినందనలతో ముంచెత్తారు. సోమవారం కలెక్టరేట్‌లో ఉత్తమ హరిత పాఠశాలలకు చెందిన పిల్లలతోపాటు ఉపాధ్యాయులు, డీఈఓ శేఖర్‌తో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఏపీ నేషనల్‌ గ్రీన్‌ కోర్‌, సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్‌ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్‌ స్కూల్‌ ప్రోగ్రామ్‌లో తిరుపతి జిల్లా నుంచి ఆరు పాఠశాలలు ఎంపికకావడం హర్షణీయమన్నారు. వారంతా ఢిల్లీకి వెళ్లి అవార్డులు స్వీకరించిన నేపథ్యంలో కలెక్టరేట్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఈఓ చేతుల మీదుగా మరోసారి ధ్రువపత్రాలను అందజేశారు. విద్యార్థి దశ నుంచే పాఠశాలల్లో పర్యావరణ అంశాలను బోధించాలని సూచించారు. ఎన్జీసీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ నీలకంఠయ్య, జిల్లా కో–ఆర్డినేటర్‌ కే.హరిశంకర్‌, కేవీ శ్యామ్‌లత పాల్గొన్నారు.

కమ్మకండ్రిగ : జెడ్పీహెచ్‌ఎస్‌

అంజూరు : జెడ్పీహెచ్‌ఎస్‌

కల్లివెట్టు : జెడ్పీహెచ్‌ఎస్‌

ఎర్రావారిపాళెం : కేజీబీవీ

నారాయణవనం: (బాలికలు– జెడ్పీహెచ్‌ఎస్‌

చంద్రగిరి : (బాలికలు)–జెడ్పీహెచ్‌ఎస్‌

జిల్లాలో ఎంపికై న హరిత పాఠశాలలు

మరిన్ని వార్తలు