ఆడపడుచుల అభ్యున్నతికి ‘ఆసరా’

28 Mar, 2023 01:44 IST|Sakshi
లబ్ధిదారులకు మెగా చెక్కు అందిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి

శ్రీరంగరాజపురం/పుత్తూరు రూరల్‌ : ఆడపడుచుల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. సోమవారం ఎస్‌ఆర్‌పురంలో వైఎస్సార్‌ ఆసరా పథకం కింద మూడోవిడత నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాల ద్వారా కనీసం రూ.3లక్షల నుంచి రూ.15లక్షల వరకు లబ్ధిపొందారని వెల్లడించారు. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎప్పుడైనా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టారా అని ప్రశ్నించారు. 2024లో అధికారం చేపట్టాలని తాపత్రయ పడుతున్న చంద్రబాబు ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని చెప్పగలరా అని సవాల్‌ విసిరారు. 2016లో ఆగిపోయిన సున్నావడ్డీ పథకాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మళ్లీ అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, ఎంపీపీ సరిత, జెడ్పీటీసీ సభ్యుడు రమణప్రసాద్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ తులసి, డీసీసీబీ డైరెక్టర్‌ బాలసుబ్రమణ్యంరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ అనంతరెడ్డి, సర్పంచ్‌ హరిత, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గురవారెడ్డి, ఏపీఎం రోజా పాల్గొన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

చంద్రబాబు మోసపు మాటలను ప్రజలు నమ్మరు

వైఎస్సార్‌ ఆసరా చెక్కుల పంపిణీలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి,మంత్రి రోజా

జగనన్నకే మళ్లీ పట్టాభిషేకం

సంక్షేమ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే ప్రజలు మళ్లీ పట్టాభిషేకం చేస్తారని మంత్రి ఆర్‌కే రోజా స్పష్టం చేశారు. సోమవారం పుత్తూరులో నిర్వహించిన వైఎస్సార్‌ ఆసరా మూడోవిడత చెక్కుల పంపిణీలో ఆమె పాల్గొన్నారు. సుమారు 11,897 మంది లబ్ధిదారులకు గాను రూ.11.27 కోట్ల చెక్కును అందజేశారు. మంత్రి రోజా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తోందని చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ ఆడపడుచుల పేరిటే అమలు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా మోసం చేసేందుకు యత్నిస్తారని, అయితే బాబు కల్లిబొల్లి మాటలను ఎవరూ నమ్మరని స్పష్ట చేశారు. అవినీతి రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేను కొనుగోలు చేశారని ఆరోపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును తగిన బుద్ధి చెప్పి హైదరాబాద్‌కు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ప్రతి మహిళా జగనన్నకు అండగా నిలవాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ జ్యోతి, మెప్మా జిల్లా అధికారి శ్రీరాములు, మెప్మా సిటీ మేనేజర్‌ ప్రమీలా, మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ఎన్‌రెడ్డి, ఎంపీడీఓ ఇందిర, మంత్రి రోజా సోదరుడు రామ్‌ప్రసాద్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ హరి, వైస్‌ చైర్మన్‌ శంకర్‌, ఎంపీపీ మునివేలు, వైస్‌ ఎంపీపీ మునస్వామిరెడ్డి, మైనారిటీ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ మాహీన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు