ఆరోగ్యానికి సురక్ష

27 Sep, 2023 00:32 IST|Sakshi
సీ.మల్లవరంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌లో ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్న వైద్య బృందం

తిరుపతి జిల్లాలోని కుటుంబాలు : 7,13,646

జనాభా : 20,53,531

వలంటీర్ల సంఖ్య : 12,357

ఇప్పటివరకు సర్వే నిర్వహించిన కుటుంబాలు : 2,02,863

ఏఎన్‌ఎంల సంఖ్య : 718

మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్ల సంఖ్య : 437

వైద్య బృందం సందర్శించిన కుటుంబాలు : 1,35,765

సర్వే నిర్వహించిన వారి సంఖ్య : 3,37,012

బీపీ పరీక్షలు చేయించుకున్న వారు : 1,35,098

షుగర్‌ పరీక్షలు : 1,20,661

ఇతర ప్రాథమిక పరీక్షలు : 1,56,452

తిరుపతి తుడా: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. వైద్య రంగంలో నూతన సంస్కరణలు తీసుకువచ్చి పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. వైద్యరంగాన్ని బలోపేతం చేయడంతో పాటు పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. సుమారు 4వేల వ్యాధులకు సంబంధించి, వెయ్యి రూపాయలకంటే ఎక్కువ ఖర్చు అయ్యే వైద్యాన్ని ఇందులో చేర్చారు. పొరుగు రాష్ట్రాలలోని కార్పొరేట్‌ ఆసుపత్రులల్లోనూ రాష్ట్ర ప్రజలు నాణ్యమైన వైద్యాన్ని పొందుతున్నారు. సీఎం మరో అడుగు ముందుకు వేసి ఇళ్ల ముంగిటకే వైద్యసేవలు అందించేందుకు ‘ఫ్యామిలీ ఫిజీషియన్‌’ విధానానికి పూనుకోవడం..ఇప్పటికే వైద్యులు ఈ కార్యక్రమంతో గ్రామాలబాట పట్టి, సేవలు అందిస్తుడడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలానే వ్యాధి తీవ్రమై ఆసుపత్రులకు వచ్చే పరిస్థితి తలెత్తకుండా వ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యం అందించేలా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఏఎన్‌ఎంలు, వలంటీర్లు ఇంటింటా వెళ్లి ప్రతి కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్య వివరాలను సేకరించి, వారికి అవసరం బట్టి ప్రాథమిక వైద్య పరీక్షలతో పాటు, థైరాయిడ్‌, కొలస్ట్రాల్‌, గుండె, ఊపితిత్తులు, మూత్రపిండాల సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు చేస్తారు. వ్యాధి నిర్థారణ అయితే ఆరోగ్యశ్రీ పథకం కింద మెరుగైన వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటారు.

ఈనెల 30 నుంచి శిబిరాలు

తిరుపతి జిల్లా వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పటిష్టంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ప్రాథమిక వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజారోగ్య వివరాలపై సర్వే చేస్తున్నారు. ఈ నెల 30 నుంచి ప్రజారోగ్య వివరాల ఆధారంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. ఏడు రకాల వైద్య పరీక్షలు చేసి, అవసరమున్న వారికి నాణ్యమైన చికిత్సను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ప్రజల ఆరోగ్య వివరాల సేకరణ ఇలా...

జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ఏఎన్‌ఎంలు, వలంటీర్లు ఇంటింటా వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. ఎత్తు, బరువు నమోదు చేయడంతోపాటు ఆర్బీఎస్‌, మలేరియా, డెంగీ, టీబీ, హిమోగ్లోబిన్‌ వంటి ప్రాథమిక పరీక్షలను వారికి చేస్తున్నారు.

పైలెట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని పైలెట్‌ ప్రాజెక్ట్‌గా తిరుపతి రూరల్‌ మండలం సీ. మల్లవరంలో సోమవారం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ శ్రీహరి ఆధ్వర్యంలో వ్యైద్యబృందం ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరించి చంద్రగిరిలోని సెంట్రల్‌ ల్యాబ్‌కు తరలించింది. అలానే ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

ఇంటింటా వైద్య పరీక్షలు ముమ్మరంగా జిల్లాలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ 30 నుంచి జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలు

ఆరోగ్య వివరాల సేకరణ ఇలా

జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ఏఎన్‌ఎంలు, వలంటీర్లు ఇంటింటా వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. హైట్‌, వెయిట్‌, ఆర్బీఎస్‌, మలేరియా, డెంగ్యూ, టీబీ, హిమోగ్లోబిన్‌ వంటి ప్రాథమిక వివరాలు ఇంటింటా సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు