వైఎస్సార్‌సీపీలో చేరిక

14 Oct, 2023 00:24 IST|Sakshi
పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, బియ్యపు పవిత్రారెడ్డి

ఏర్పేడు: మండలంలోని బండారుపల్లిలో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో 40 కుటుంబాలకు పైగా వన్నెరెడ్డిలు, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఇందులో గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి, వెంకటరామిరెడ్డి, సుబ్బమ్మ, మధు, వెంకట్రాయులు, నరసమ్మ, శివ, నారాయణ, లక్ష్మి, పవన్‌, తరుణ్‌, మునిరత్నం, వెంకటమునిరెడ్డి, సుజాత, చంద్రారెడ్డి, హరిప్రియ తదితర 40 కుటుంబాలకు పైగా ఉన్నాయి. వారికి ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు చెప్పారు. వైఎస్సార్‌ సీపీ మండల ఇన్‌చార్జ్‌ గున్నేరి కిషోర్‌రెడ్డి, సర్పంచ్‌ జీవిత, వైస్‌ ఎంపీపీ తిరుపతి జనార్దన్‌రెడ్డి, జ్యోతి, ఆదెమ్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు