బిగ్‌బాస్‌: అరియానా తీరుపై సోహైల్ మండిపాటు

9 Dec, 2020 15:58 IST|Sakshi

బిగ్‌బాస్ కంటెస్టెంట్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించేందుకు ఓపిక టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఓ కంటెస్టెంటు ఎలాంటి ఎక్స్‌ప్రెష‌న్స్ లేకుండా రోబోలా కూర్చుంటే మిగ‌తావారు స‌ద‌రు వ్య‌క్తిని డిస్ట‌ర్బ్ చేయొచ్చు. ఏ ముహూర్తాన బిగ్‌బాస్ ఈ టాస్క్ ఇచ్చాడో కానీ కంటెస్టెంట్లు స‌హ‌నం కోల్పోయి మ‌రీ ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ముఖ్యంగా మోనాల్‌, అరియానా మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి వ‌చ్చింది. అరియానా తీరుతో మండిపోయిన సోహైల్ ఆమెతో క‌య్యానికి కాలు దువ్వాడు. 

మోనాల్ కోసం ఇద్ద‌రి మ‌ధ్య లొల్లి
టాస్క్‌లో భాగంగా మోనాల్ రోబోలా కూర్చున్న అరియానాకు కోపం తెప్పించేందుకు ప్ర‌య‌త్నించింది. ఆమెకు ఇష్ట‌మైన బొమ్మ‌ను ఎక్క‌డో గోడ‌పై ప‌డేసింది. ఆమె డ్రెస్‌లో ఐస్‌క్యూబ్స్ వేసిన‌ట్లే వేసి తీసేసింది. అయితే ఎన్ని చేసినా త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు అరియానా చ‌ల‌నం లేకుండా కూర్చుండిపోయింది. కానీ టాస్క్ పూర్తైన మ‌రుక్ష‌ణం మోనాల్‌పై విరుచుకుప‌డింది. ఆమె క‌ళ్ల‌ల్లో త‌న మీదున్న ప‌గ‌ను చూశాన‌ని చెప్పుకొచ్చింది. మ‌న‌సులో ఇంత ప‌గ‌ పెట్టుకుని బ‌య‌ట‌కు బాగా మాట్లాడుతూ న‌టించింద‌ని నిందించింది.  ఈ రోజు మోనాల్ నాకు మొత్తం అర్థ‌మైపోయిందంటూ ఆవేశ‌ప‌డింది. (చ‌ద‌వండి: టోట‌ల్ డ్యామేజ్ చేసుకుంటున్న అఖిల్‌)

నీకు మ‌నిషికి విలువివ్వ‌డం రాదు: సోహైల్‌
ఆ స‌మ‌యంలో మోనాల్ స‌హ‌నంగా ఉండాల్సిన టాస్క్ చేస్తుండ‌టంతో ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేక‌పోయింది. కానీ టాస్క్ పూర్త‌వ‌గానే లోప‌ల‌కు వెళ్లి గుక్క‌పెట్టి ఏడ్చింది. శూలాల్లా గుచ్చుకున్న ఆమె మాట‌ల‌ను త‌లుచుకుంటూ గుండెల‌విసేలా రోదించింది ఇది సోహైల్‌కు అస్స‌లు న‌చ్చ‌లేదు. దీంతో ఆమె చేసింది త‌ప్ప‌ని అత‌డు మోనాల్‌కు స‌పోర్ట్‌గా నిల‌బ‌డ్డాడు. మ‌నిషికి విలువివ్వ‌డం తెలీద‌ని అరియానాను త‌ప్పుప‌ట్టాడు. ఇది స‌హించ‌లేక‌పోయిన అరియానా ఎదురు తిరిగింది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఇద్ద‌రూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. దీంతో అఖిల్ సోహైల్‌ను ప‌క్క‌కు తీసుకెళ్ల‌గా అభిజిత్ అరియానాను స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ క్ర‌మంలో ఆమె ఏడుస్తూ కింద‌ప‌డిపోయింది. (చ‌ద‌వండి: నాతో ఉన్న‌ట్లుగా వేరే అబ్బాయితో ఉంటే నాకు న‌చ్చ‌దు)

మరిన్ని వార్తలు