Godfather Day 3 Box Office Collections: గాడ్‌ ఫాదర్‌ కలెక్ష‍న్ల సునామీ.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు

8 Oct, 2022 21:03 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్‌ ఫాదర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్‌ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పలు రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్  అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

(చదవండి: బాలీవుడ్‌లో ‘గాడ్‌ ఫాదర్‌’ హవా.. 600 స్క్రీన్స్‌ పెంపు)

గతంలో మెగాస్టార్ ఖైదీ నెం.150 మాత్రమే రూ.164 కోట్లతో ఆయన కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిందన్నారు. త్వరలోనే గాడ్‌ఫాదర్‌ ఈ రికార్డును అధిగమించనుందని ట్వీట్ చేశారు. గతంలో విడుదలైన ఆచార్య వసూళ్లను అధిగమించింది. గాడ్ ఫాదర్ 2019లో వచ్చిన మలయాళ చిత్రం లూసిఫర్‌కి తెలుగు రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార, సత్యదేవ్ నటించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. 

మరిన్ని వార్తలు