శృతిమించిన ఎమ్మెల్యే అనుచరుల వర్గపోరు

9 Oct, 2021 13:10 IST|Sakshi
ఎంపీడీఓ కార్యాలయ గేటు వద్ద ఇరువర్గాల తోపులాట

 పాలేరు నియోజకవర్గంలో విబేధాలు

ఎంపీడీఓ కార్యాలయం వద్ద పరస్పరం రాళ్లదాడి

సాక్షి, ఖమ్మం: పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అనుచరుల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. టీఆర్‌ఎస్‌ మండలాల కమిటీల ప్రకటన సందర్భంగా గురువారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకుల మధ్య తోపులాట జరిగిన విషయం విదితమే. ఇక శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీసీసీబీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌తో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు అయిన ఆయన సతీమణి బేబీ హాజరయ్యారు. ఇదే సమావేశానికి సొసైటీ చైర్మన్‌ వాసంశెట్టి వెంకటేశ్వర్లు భార్య, సర్పంచ్‌ అరుణ కూడా వచ్చారు.
చదవండి: 10 రోజులుగా పత్తాలేని పిల్లి.. అన్నం ముట్టని తల్లి.. స్కూల్‌కు వెళ్లని పిల్లలు, దాంతో..

ఇంతలోనే వెంకటేశ్వర్లు తన అనుచరులతో ఎంపీడీఓ కార్యాలయానికి వస్తుండగా, అప్పటికే కార్యాలయంలో మొహరించిన శేఖర్‌ అనుచరులు కార్యాలయ గేట్‌ వద్ద వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ పెరిగి పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకున్నా సీఐలు సతీష్, సత్యనారాయణరెడ్డి తమ సిబ్బందితో అక్కడకు చేరుకొని నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
చదవండి: ‘ఎగబడి కరుస్తున్నాయ్‌.. కుక్కలే కదా చంపితే ఏమవుతుందిలే’

మరిన్ని వార్తలు