అభయారణ్యంలో మినీ ఊటి..!

31 Oct, 2021 17:46 IST|Sakshi
నిర్మాణం అవుతున్న అద్దాల మేడా..బోటింగ్‌ చేస్తున్న పర్యాటకులు

కొత్తగూడెం అర్బన్‌: ఏజెన్సీ జిల్లాగా పేరున్న భద్రాద్రి కొత్తగూడెంలోని అభయారణ్యంలో మినీ ఊటిని తలపిస్తున్న కిన్నెరసానీ ప్రాజెక్టు పర్యటక ప్రాంతం జిల్లాకే మంచి గుర్తింపును ఇస్తుంది. అక్కడ అభయారణ్యంలో రోడ్డుకు ఇరువైపులా పచ్చటి చెట్లు, చెట్లలో వంద రకాల పక్షులు, జంతువులు, పులులు, చిరుతలు, అడవిదున్నలు, ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, నక్కలు, కణుజులు, కోతులు, కొండముచ్చులున్నాయి. వన్యప్రాణులు, జంతువులు జీవ వైవిద్యానికి నిలయం కిన్నెరసానీ ప్రాజెక్టు. జింకల పార్కు 14.50 హెక్టార్ల విస్తీరణంలో ఉండగా, అభయారణ్యం 634.4 చ.కి.మీ విస్తీరణంలో ఉంది. 


జింకల పార్కు వద్ద పర్యాటకుల సందడి

అయితే 1963–64 సంవత్సరంలో నిర్మాణం అయిన కిన్నెరసానీ ప్రాజెక్టు నుంచి నీరు పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజలు తాగునీరుగా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటుగా 10 వేల ఎకరాల పంటల పొలాలకు నీరును ఎడమ, కుడి కాల్వల ద్వారా అందిస్తుంది. అయితే ప్రాజెక్టు వద్ద 1972 సంవత్సరంలో అభయారణ్యం ప్రాంతంను పర్యటక ప్రాంతంగా టూరిజం వారు గుర్తించి అభివృద్ధి చేశారు. 1974 సంవత్సరంలో ఇక్కడ జింకల పార్కును ఏర్పాటు చేశారు. తొలుత 3 జింకలతో ఏర్పాడిన పార్కు, ప్రస్తుతం 132 జింకలతో సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇందులో కృష్ణ జింకలు, చుక్కల దుప్పులు, కొండ గొర్రెలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. 


కిన్నెరసాని ప్రాజెక్టు

అయితే తొలుత సింగరేణి ఆదీనంలో ఉన్న ఈ పర్యటక ప్రాంతం 2000 సంవత్సరం తరువాత వైల్డ్‌లైప్‌ వారి అప్పగించారు. అయితే ఇక్కడ ఉన్న అద్దాల మెడ ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. అయితే 1999 సంవత్సరంలో ఫిపుల్స్‌ వారు దీనిని పేల్చివేశారు. అయితే ప్రస్తుతం అద్దాల మెడా, కాటేజ్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తి అయితే మరింతా మంది సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు, జింకల పార్కు, బొటింగ్‌ కోసం వారానికి పది వేల మంది వరకు సందర్శకులు అంతర్‌ రాష్ట్రల నుంచి వస్తున్నారు. 


జింకల పార్కు దృశ్యం

అద్దాల మెడ, కాటేజ్‌లు పూర్తి అయితే సందర్శకులు, పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కెటీపిఎస్‌ అధికారులు రిజర్వాయర్‌ ప్రారంభంలో జలదృశ్యం(విశ్రాంతి గది) ఏర్పాటు చేశారు. అది మాత్రం మనుగడలో ఉంది. అయితే తెలుగు రాష్ట్రలలలో మొసళ్లు మోరె జాతి (నల్లవి) వేల సంఖ్యలో కిన్నెరసానీ ప్రాజెక్టులో ఉన్నాయి. దీంతో పాటుగా కిన్నెరసానీలో బోటింగ్‌ ప్రతి రోజు ఉంటుంది. ప్రాజెక్టు చూడడానికి వచ్చిన ప్రతి వారు బోటింగ్‌ చేయకుండా వెళ్లారు.

మరిన్ని వార్తలు