కన్నీటి సాగు

5 Aug, 2023 04:14 IST|Sakshi
చెరువు నీటితో నిండిన శిఖం భూమిలోని పొలాలు

బొంరాస్‌పేట: ఇటీవల కురిసిన ఏకధాటి వర్షాలకు వాగులు, వంకల్లో వరద పరవళ్లు తొక్కుతూనే ఉంది. జలాశయాలు నిండుకుండలా మారి, అలుగుపోస్తున్నాయి. వరద ఉధృతికి ఉమ్మడి బొంరాస్‌పేట మండల(బొంరాస్‌పేట, దుద్యాల) పరిధి గ్రామాల్లో ఆయకట్టు పొలాలతో పాటు చెరువుల చుట్టూ ఉన్న సాగుభూములన్నీ వర్షపునీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి.

తగ్గనున్న దిగుబడి!

ఏర్పుమళ్ల కాకర్‌వాణి ప్రాజెక్టు, దుద్యాల పెద్ద చెర్వు, బొంరాస్‌పేట, బురాన్‌పూర్‌తో పాటు 13 నోటిఫైడ్‌ చెరువులు, మరో 50వరకు చిన్న చెరువులు, కుంటలున్నాయి. ఇందులో అధికారుల లెక్కల ప్రకారం 5,012 ఎకరాలు (సుమారు 2వేల హెక్టార్లు) ఆయకట్టు ఉంది. ఇందులో యేటా వర్షాకాలంలో హెక్టారుకు 200బస్తాల చొప్పున 4.66లక్షల బస్తాల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతుండగా.. వాటి చుట్టూ ఉన్న పంట పొలాలు నీటమునిగాయి. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.

నిండా ముంచిన వరదలు

దిక్కుతోచని కర్షకులు

ప్రభావిత పొలాలపై దృష్టి

వరద బాధిత పంట నష్టంపై ఉన్నతాధికారులు, లేదా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం, సూచనలు లేవు. శిఖానికి దగ్గరలో ఉండి, పంటసాగుకు ఇబ్బందిగా ఉన్న పొలాల సమాచారం ఏఈఓల ద్వారా రావాలి. ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

– శంకర్‌ రాథోడ్‌, ఏడీఏ, కొడంగల్‌

ఆదుకోవాలి

మా పొలం బాపన్‌చెర్వు శిఖంకు ఆనుకొని ఉంది. రెండు ఎకరాల పొలం ప్రస్తుతం వరద మంపులో ఉంది. వానాకాలం సాగుతో 80బస్తాల వరకు దిగుబడి వచ్చి, రూ.50 వేల వరకు ఆదాయం వస్తుంది. నిన్నమొన్నటి వానలకు నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

– హన్మంతు చౌహాన్‌, రైతు, మూడుమామిళ్లతండా

మరిన్ని వార్తలు