సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ

5 Dec, 2023 05:28 IST|Sakshi

తాండూరు: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా బందోబస్తు చేపట్టామని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ తెలిపారు. ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి గ్రామాల్లో పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ–కర్ణాటక అంతర్రాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మద్యం, డబ్బు అక్రమ రవాణాను కట్టడి చేశామన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకుచెందిన నాయకులు కూడా శాంతిభద్రతలకు సహకరించారన్నారు. తాండూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో పోలీసు అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. పోలింగ్‌ రోజు పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ వెంటనే కట్టడి చేశామన్నారు. ఈ ఎన్నికలకు సంభందించి తాండూర్‌ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయన్నారు. ప్రశాంత ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌

>
మరిన్ని వార్తలు