తీరానికి కొట్టుకొచ్చిన మరపడవ

15 Nov, 2023 09:12 IST|Sakshi
ఎగువపేట తీరానికి కొట్టుకొచ్చిన మరపడవ

భీమునిపట్నం: భీమిలి తీరానికి సోమవారం రాత్రి ఒక మర పడవ (మెకనైజ్డ్‌ బోటు) కొట్టుకొచ్చింది. మండలంలోని చిన నాగమయ్యపాలెంకు చెందిన ఎనిమిది మంది మత్సక్యారులు బోటు నంబర్‌ 1155లో చేపల వేటకు విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి సోమవారం బయలుదేరారు. వీరి బోటు భీమిలి వైపు నుంచి వెళ్తున్న క్రమంలో ఇంజిన్‌ పాడైపోయి ఆగిపోయింది.

అదే సమయంలో గాలులు తీవ్రంగా వీస్తుండడంతో పడవ ఎగువపేట సమీపంలో తీరానికి కొట్టుకొచ్చి ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఇందులోని మత్స్యకారులకు ప్రమాదం జరగలేదు. బోటు యజమాని గరికిన దానయ్య, మ్స్యకారులు బొడ్డు దుర్గయ్య, వాసుపల్లి నీలయ్య, వాసుపల్లి కుంచయ్య, వాసుపల్లి అప్పారావు, గరికిన ఎల్లాజీ, గరికిన నూకరాజు, వాసుపల్లి దానయ్య తీరానికి సురక్షితంగా చేరుకున్నారు.

ఈ సంఘటనలో రూ.35 లక్షల విలువైన పడవ అడుగు భాగంతోపాటు మరికొన్ని చోట్ల పాడైపోవడంతో తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందివ్వాలని దానయ్య కోరుతున్నారు.

మరిన్ని వార్తలు