2024లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం

15 Nov, 2023 01:04 IST|Sakshi
మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు కోలా గురువులు

కొమ్మాది: అకుంటిత దీక్ష, అంకిత భావంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా అందరూ పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు పిలుపునిచ్చారు. ఎండాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లి పార్టీ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. ఈ నెలలో ప్రారంభమయ్యే రెండో విడత సామాజిక సాధికార యాత్రను విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, నాటి టీడీపీ పాలనకు, నేటి వైఎస్సార్‌సీపీ పాలనకు తేడా ఏమిటో వివరించాలన్నారు. అనంతరం కొత్తగా నియామకమైన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులను గురువులు సత్కరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దామా సుబ్బారావు, పీలా ఉమారాణి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు జి.రవిరెడ్డి, జోనల్‌ ఇన్‌చార్జి వంకాయల మారుతీప్రసాద్‌, కలిదండి బద్రినాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు