గరికిపాటి ప్రవచనాలతో యువత మేల్కొలుపు

15 Nov, 2023 01:04 IST|Sakshi
గరికిపాటికి సాహిత్య కళాభారతి పురస్కారం ప్రదానం చేస్తున్న నిర్వాహకులు

మద్దిలపాలెం : గరికిపాటి నరసింహారావు ప్రవచనాలు నేటి యువతరానికి మేల్కొలుపులాంటివని ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో గరికిపాటికి సాహిత్య కళాభారతి పురస్కారం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యువతీ, యువకులు గరికిపాటి ప్రవచనలో అంశాలను ఆకళింపు చేసుకుని ఆధ్యాత్మిక భావంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పురస్కార గ్రహీత గరికిపాటి మాట్లాడుతూ సాహిత్య కళాభారతి పురస్కారం ప్రదానం చేసి మా ఇంటికి శారదాంబను పంపారని కొనియాడారు. అనంతరం శ్రీనాథుడు రచించిన ఆకాశ దీపం– కాశీ ఖండంపై గరికిపాటి చెప్పిన ప్రవచనాలు ఆకట్టుకున్నాయి. వీఎండీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎంఎస్‌ఎన్‌ఆర్‌, డాక్టర్‌ గుమ్ములూరి రాంబాబు మాట్లాడుతూ కాశీ ఖండంపై మూడు రోజుల పాటు సాయంత్రం 5.30 గంటలకు ప్రవచనాలు ప్రారంభమవుతాయన్నారు.

మరిన్ని వార్తలు