డిజి లాకర్‌లో రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌ వివరాలు

15 Nov, 2023 01:04 IST|Sakshi

గోపాలపట్నం: డిజిలాకర్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ కార్డులు అందుబాటులో ఉంటాయని ఉప రవాణా కమిషనర్‌ రాజారత్నం ఓ ప్రకటనలో తెలిపారు. ప్లేస్టోర్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని మొబైల్‌ నంబర్‌/ఆధార్‌తో లాగిన్‌ అవ్వాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సెలక్ట్‌ చేసుకుని.. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, వెహికల్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, చాసిస్‌ నంబర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబర్‌ నమోదు చేయాలన్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, లైసెన్స్‌ వివరాలు నేరుగా వాహన్‌ సారథి నుంచి డౌన్‌లోడ్‌ అవుతాయని చెప్పారు. ఈ యాప్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రాలు ప్రామాణికమైనవని స్పష్టం చేశారు. పోలీస్‌, రవాణా శాఖ అధికారులు వాహనం తనిఖీ చేసినపుడు డిజిలాకర్‌లో ఉన్న ఈ పత్రాలు చూపించవచ్చని సూచించారు. జూలై 23 వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ కార్డుల కోసం ఫీజు చెల్లించిన వారికి ఆయా తేదీల వారీగా కార్డు జారీ చేస్తామన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ వ్యాలిడిటీ ఉండి కార్డు లేకపోయినా బీమా పొందవచ్చన్నారు. పోలీ సు, రవాణా శాఖ అధికారులు డిజిటల్‌ పత్రాలను అనుమతించకపోతే పోలీస్‌ కమిషనర్‌కు గానీ, ఉప రవాణా కమిషనర్‌కు గానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. విచారణ చేసి ఆ అధికారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు