-

సామాజిక స్పృహ కలిగించేవి నాటికలు

28 Nov, 2023 00:58 IST|Sakshi
ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమర్‌నాథ్‌

బీచ్‌రోడ్డు: నేటి బాలలకు అలనాటి కథలను నాటికల రూపంలో తెలియజేసి.. మంచి, చెడును వివరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పిలుపునిచ్చారు. మూడు రోజులుగా వీఎంఆర్డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో జరుగుతున్న వైజాగ్‌ జూనియర్‌ థియేటర్‌ ఫెస్ట్‌ సోమవారంతో ముగిసింది. ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పాఠశాలల్లోని డిజిటల్‌ తరగతి గదుల్లో ఇలాంటి నాటికలను ప్రదర్శించాలన్నారు. తారస్‌ ట్రియో, మాల్గుడి డేస్‌ నాటికలు పిల్లలకు వినోదంతో పాటు సమాజం పట్ల అవగాహ న పెంపొందించాయన్నారు. తెలుగు విద్యార్థుల కోసం బరిబతల రాజా నాటికను ప్రత్యేకంగా ప్రదర్శింపజేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి ప్రదర్శనలు ఉపయుక్తంగా నిలుస్తాయన్నారు. భవిష్యత్‌లో థియేటర్‌ ఫెస్ట్‌ను మరింత ఆసక్తికరంగా కొనసాగించాలని నిర్వాహకులను సూచించారు. వీఎంఆర్డీఏ జాయింట్‌ సెక్రటరీ రవీంద్ర, పైడా కృష్ణ ప్రసాద్‌, కంకటాల మల్లిక్‌ తదితరులు పాల్గొన్నారు.

చుట్టూ ఉన్న వారి ఆనందమే మన ఆనందం

చుట్టూ ఉన్న వారు ఎలా పోయిన ఫర్వాలేదు.. మనం సుఖంగా, ఆనందంగా ఉంటే చాలు అనుకుంటే ఏదో ఓ రోజు మనల్ని ఎవరో ఒకరు మోసం చేస్తారు. ఇదే కథతో బరిబతల రాజా నాటికను హైదరాబాద్‌కు చెందిన కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఓ రాజు రాజ్యం కోసం కాకుండా కేవలం తన ఆనందం కోసం వస్త్రాలపై అధిక శ్రద్ధ చూపిస్తాడు. ఈ విషయాన్ని గమనించిన కొందరు ఆయనకు మాయమాటలు చెప్పి.. మోసం చేస్తారు. ప్రజల ముందు అవహేళనకు గురి చేస్తారు. దీంతో ఆ రాజుకు జ్ఞానోదయం అవుతుంది. మన చుట్టు ఉన్న వారు ఆనందంగా ఉంటే.. మనం కూడా ఆనందంగా ఉంటామని భావించి.. రాజ్యంలో ప్రజల సుఖసంతోషాల కోసం పనిచేస్తాడు. ఈ కథను కళాకారులు వినోదాత్మకంగా.. పిల్లలకు అర్థమైన రీతిలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అలాగే ముంబయికి చెందిన కునాల్‌ మోట్లింగ్‌, సందేశ్‌ సంజయ్‌లు ప్రదర్శించిన మైమ్‌ ప్రదర్శన చిన్నారులు, పెద్దలను విశేషంగా అలరించింది. కేవలం హావభావాలు, వ్యక్తీకరణాల ద్వారా నవ్వించడంతో పాటు మంచి సందేశమిచ్చారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ముగిసిన వైజాగ్‌ జూనియర్‌ థియేటర్‌ ఫెస్ట్‌

మరిన్ని వార్తలు