-

స్పందన ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం

28 Nov, 2023 00:58 IST|Sakshi

మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. అర్జీదారుల నుంచి స్వీకరించే వినతులను తక్షణమే పరిష్కరించాలన్నారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం(స్పందన)కు 206 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా స్థాయి స్పందనకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో.. డివిజన్‌, మండల స్థాయిలో నిర్వహించే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి కూడా అంతే ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. అర్జీదారు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని, ఫిర్యాదు రీ–ఓపెన్‌ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 95, జీవీఎంసీకి 49, పోలీసు శాఖకు 18, ఇతర శాఖలకు సంబంధించి 44 మొత్తం 206 వినతులు వచ్చాయి. జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్‌, ఏసీపీ బాపూజీ, జీవీఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ వర్మ, డీఎల్‌డీవో పూర్ణిమాదేవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు