-

చికిత్స పొందుతూ యువకుడి మృతి

28 Nov, 2023 00:58 IST|Sakshi

పీఎంపాలెం: జీవీఎంసీ 7వ వార్డు వాంబే కాలనీలో జరిగిన గ్యాస్‌ లీకేజీ ఘటనలో బాలరాజు చిన్న కుమారుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే. పీఎంపాలెం ఎస్‌ఐ కె.సురేష్‌కుమార్‌ తెలిపిన వివరాలివీ. ఈ నెల 24వ తేదీ ఉదయం ఆరు గంటలకు వాంబే కాలనీ 27 బీ బ్లాకు ఎఫ్‌ఎఫ్‌ 2 లో వంట గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో యనమల బాలరాజు, అతని భార్య చిన్ను, పెద్ద కుమారుడు గిరి, చిన్న కుమారుడు కార్తీక్‌(20) కాలిపోయారు. అధిక శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కార్తీక్‌ సోమవారం మరణించాడు. మిగతా ముగ్గురు చికిత్స పొందుతున్నారని ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ తెలిపారు.

వాంబేకాలనీలో గ్యాస్‌ లీకేజీ ఘటన

మరిన్ని వార్తలు