-

కేబీఆర్‌లో మృత శిశువు లభ్యం

28 Nov, 2023 00:58 IST|Sakshi

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌ రెండవ కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(కేబీఆర్‌)లో సోమవారం మృత మగ శిశువు లభించింది. స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు తెలిపిన వివరాలివీ.. కేబీఆర్‌–2కు చెందిన స్పిల్‌ గేటు–1 వద్ద కొంత మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారు. వారికి కాలువలో కొట్టుకు వచ్చిన పూల మధ్య నీటిపై తేలుతూ ఒక మృతదేహం కనిపించింది. దీంతో వారు తమ సూపర్‌వైజర్‌కు తెలిపారు. ఆయన స్టీల్‌ప్లాంట్‌ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ వి.శ్రీనివాసరావు కేబీఆర్‌కు వెళ్లి చూడగా ఇటీవల పుట్టిన మగ శిశువు చనిపోయి ఉండటం గుర్తించారు. వెంటనే ఆ మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు పంపారు. మూడు రోజుల పాటు కేజీహెచ్‌లో మృతదేహాన్ని ఉంచుతామని ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు