-

10న మిస్టర్‌ విశాఖ బాడీ బిల్డింగ్‌ పోటీలు

28 Nov, 2023 01:00 IST|Sakshi
మిస్టర్‌ విశాఖ బాడీబిల్డింగ్‌ పోటీల పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న రాజారావు

పెదగంట్యాడ: వచ్చే నెల 10న విశాఖ నగరంలోని మర్రిపాలెం కరాసలో 2వ మిస్టర్‌ విశాఖ బాడీబిల్డింగ్‌ పోటీలు నిర్వహించనున్నామని విశాఖ బాడీబిల్డర్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సవలాపురపు రాజారావు తెలిపారు. ఈ మేరకు పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను పెదగంట్యాడలోని ఆర్కే ఫిట్‌నెస్‌ జిమ్‌ ఆవరణలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్కే ఫిట్‌నెస్‌ జిమ్‌ అధినేత ఆర్కే గున్న ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీల్లో విజేతలకు చాంపియన్‌ ఆఫ్‌ చాంపియన్‌ పేరుతో బంగారు పతకాలు అందజేయనున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు