సముద్రంలో గల్లంతైన విద్యార్థి మృతి

29 Nov, 2023 01:22 IST|Sakshi

పరవాడ: తంతడి తీరంలో గల్లంతైన పరవాడ బీసీ కాలనీకి చెందిన 9వ తరగతి విద్యార్థి జంగాల రాజేష్‌(14) మృతదేహం మంగళవారం పూడిమడక తీరానికి చేరింది. ఈ నెల 26న పరవాడ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన నలుగురు స్నేహితులతో కలిసి రాజేష్‌ తంతడి తీరానికి వెళ్లాడు. ఆ రోజు మధ్యాహ్నం స్నేహితులతో కలిసి సముద్రంలో స్నానానికి దిగాడు. ఈ క్రమంలో భారీ అలకు కొట్టుకుపోయాడు. రాజేష్‌ కోసం రెండు రోజులుగా కుటుంబ సభ్యులు, పోలీసులు, నేవీ అధికారులు విస్తృతంగా గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి విద్యార్థి జీవితం విషాదంగా ముగసింది. పూడిమడక తీరానికి అతని మృతదేహం చేరింది. అలలకు రాజేష్‌ బలికావడంతో అతని తల్లిదండ్రులు సంతోషి, సత్యనారాయణ బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థి మృతదేహన్ని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లేశ్వరరావు తెలిపారు.

మరిన్ని వార్తలు