బాల్య వివాహాల అడ్డుకట్టకు పకడ్బందీ చర్యలు

29 Nov, 2023 01:22 IST|Sakshi
మాట్లాడుతున్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు గొండు సీతారాం

మహారాణిపేట: సచివాలయల మహిళా సంరక్షణ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 31, 39ల ద్వారా శక్తివంతమైన అస్త్రాలను అందించిందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు గొండు సీతారాం తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనపై జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, రెవెన్యూ, పోలీసు, విద్యా శాఖ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ వలంటీర్లను సమన్వయం చేసుకుంటూ.. బాల్య వివాహాలు జరగకుండా సంబంధిత కుటుంబ సభ్యులకు చట్టాలు, శిక్షలు, అపరాధ రుసుం, వివాహాలు జరిగితే తలెత్తే సమస్యలపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చా రు. చట్టాన్ని ధిక్కరించి బాల్య వివాహాలు చేస్తే పో క్సో, ఇతర కేసుల నమోదుకు చర్యలు చేపట్టాలన్నా రు. ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ మాట్లాడుతూ జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్‌ పీడీ డి.వెంకటేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా అన్ని శాఖల సమన్వయంతో చట్టా న్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. అనంతరం బాల్య వివాహాలు నిలుపుదలలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల పాత్రపై రూపొందించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. బాలల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షురాలు ఎం.ఆర్‌.ఎల్‌.రాధ, జిల్లా బాల్య సంరక్షణాధికారి బి.హెచ్‌.లక్ష్మి, డీఎల్‌ఈవో కో–ఆర్డినేటర్‌ ఎం.ప్రసాద్‌, ఎంఈవోలు, దిశ పోలీస్‌ అధికారి కాంతారావు, సీడీపీవో శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు