హోటళ్లలో విజిలెన్స్‌ దాడులు

29 Nov, 2023 01:22 IST|Sakshi

జగదాంబ: జగదాంబ దరి హేలాపూరి హోటల్‌లో ఎన్‌ఫోర్సుమెంట్‌ డీఎస్పీ స్వరూపరాణి, ఫుడ్‌ సేఫ్టీ అధికారి అప్పారావు, సిబ్బందితో కలి సి ఆకస్మిక దాడులు నిర్వహించారు. కోడి, మేక మాంసం, చేపలు నిల్వ ఉండడం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ నగరంలో పలు హోటళ్లలో బిర్యానీ, నాన్‌వెజ్‌ పదార్థాలు నిల్వ ఉంచి వేడి చేసి నాణ్యత లేకుండా అమ్మకాలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీని వల్ల ప్రజారోగ్యానికి హాని కలుగుతుందన్నారు. హేలాపూరి హోటల్‌లో తమ సిబ్బంది తనిఖీ చేసిన సమయంలో వినియోగారులకు నిల్వ ఉన్న నాన్‌వెజ్‌ పదార్థాలు పెడుతుండడం గమనించినట్లు తెలిపారు. ఆహార పదార్థాలన్ని సీజ్‌ చేసి ఫుడ్‌క్వాలిటీ విభాగానికి పంపిస్తామన్నారు.

జీ షాన్‌ రెస్టారెంట్‌పై దాడులు

పీఎం పాలెం: శిల్పారామం జాతరకు సమీపంలోని జీ షాన్‌ రెస్టారెంట్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, సరఫరా చేస్తున్న ఆహారంలో బొద్దింకలు ఉంటున్నాయని ఫిర్యాదులు అందడంతో మంగళవారం విజిలెన్స్‌ సీఐ కోటీశ్వరరావు తనిఖీలు నిర్వహించారు. వంట గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. నిల్వ ఉన్న తందూరి, కల్మీ కబాబ్‌, చికెన్‌ జాయింట్‌ బిర్యానీని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు