దుర్గమ్మకు బంగారపు వస్తువుల విరాళం

29 Nov, 2023 01:22 IST|Sakshi
బచ్చు మాధవీకృష్ణ దంపతులకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఈవో రామారావు

ఇంద్రకీలాద్రి(విజయవాడ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు విశాఖకు చెందిన సత్యనారాయణరెడ్డి, విజయ దంపతులు 47 గ్రాముల బంగారంతో బొట్టు, నత్తు, బులాకీలను సమర్పించారు. సత్యనారాయణరెడ్డి, విజయ దంపతులకు స్నేహితురాలైన దేవస్థాన పాలక మండలి సభ్యురాలు బచ్చు మాధవీకృష్ణ దంపతుల చేతుల మీదుగా ఆలయ ఈవో కేఎస్‌ రామారావుకు మంగళవారం బంగారపు ఆభరణాలను అందజేశారు. సుమారు 20.8 గ్రాముల బంగారు రాళ్లబొట్టు, 15.8 గ్రాముల బంగారంతో నత్తు, 10.7 గ్రాముల బంగారంతో బులాకీలను తయారు చేయించి దేవస్థానానికి అందించారు.

మరిన్ని వార్తలు