నేవీ డే వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు

29 Nov, 2023 01:22 IST|Sakshi

మహారాణిపేట : నేవీ డే వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. నేవీ డే వేడుకల నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై నేవల్‌ కమాండ్‌, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరంలో ఐదు చోట్ల పార్కింగ్‌ సదుపాయం కల్పించాలని సూచించారు. బీచ్‌ వద్ద లైఫ్‌ గార్డులను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. నేవీ డే రోజైన డిసెంబర్‌ 4న డ్రోన్లు, గాలిపటాలు ఎగుర వేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. వీక్షకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రాకపోకలు సాగించేందుకు అనువుగా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు పుష్కలంగా సమకూ ర్చాలని, బయో టాయిలెట్స్‌ ఏర్చాటు చేయాలని సూచించారు. క్రిటికల్‌ కేర్‌ అంబులెన్స్‌, రెండు అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. బీచ్‌ సమీపంలోని ఏపీఐఐసీ స్థలంలో వీఐపీ పార్కింగ్‌ ఏర్పాటు చేసి, అక్కడ నుంచి నేరుగా బీచ్‌ రోడ్డులోకి వీఐపీలు చేరుకునే విధంగా తాత్కాలిక ద్వారం ఏర్పాటు చేయాలని సూచించారు. నేవీ, పోలీసు అధికారులు సమన్వయంతో ప్రొటోకాల్‌ బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు. కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ (సి–ఇన్‌ –సి) హౌస్‌ వద్ద ఎట్‌ హోమ్‌ ఉంటుందని, అక్కడ పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ అంశాలపై నేవీ అధికారులతో చర్చించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సామాన్య ప్రజలు, ప్రముఖుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, లైఫ్‌ గార్డులను అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌ కుమార్‌, నేవీ కెఫ్టెన్‌ బీపీ శేఖర్‌, కమాండర్లు వైకే కిశోర్‌, ఉదయ్‌ అగర్వాల్‌, జగమేద్‌ సింఘ్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ కాంతిమతి, వీఎంఆర్డీఏ సెక్రటరీ డి.కీర్తి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.జగదీశ్వరరావు, జీవీఎంసీ సీఈ బి.రవి కృష్ణంరాజు, ఏడీసీ శ్రీనివాసరావు, ఎస్‌ఈ వేణుగోపాల్‌, సమాచార పౌర సంబంధాల శాఖ జేడీ మణిరామ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు