అంబేడ్కర్‌నగర్‌లో సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన

29 Nov, 2023 01:24 IST|Sakshi

మర్రిపాలెం: రాష్ట్రంలో 28 విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే 16 కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లాకు సంబంధించి ఆర్‌అండ్‌బీ దరి మాధవధార అంబేడ్కర్‌నగర్‌లో సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ఆయనకు శంకుస్థాపన చేయగా.. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, కలెక్టర్‌ మల్లికార్జున, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ ఉత్తర సమన్వయకర్త కె.కె.రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ పాలనలో పవర్‌ కట్‌లు లేవన్నారు. విద్యుత్‌ వ్యవస్థ పటిష్టానికి ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. వార్డు కార్పొరేటర్‌ రెయ్యి వెంకటరమణ, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌, పార్టీ మండల అధ్యక్షుడు అల్లు శంకరరావు, ఈపీడీసీఎల్‌ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు