సమ్మెటివ్‌ పరీక్షలు ప్రారంభం

29 Nov, 2023 01:24 IST|Sakshi
అక్కయ్యపాలెం మున్సిపల్‌ స్కూల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

విశాఖ విద్య: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో సమ్మెటివ్‌–1 పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొదటి లాంగ్వేజీ పరీక్ష జరిగింది. ఒకటి నుంచి 6వ తరగతి, 8, 10వ తగరతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు, 7, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1.30 నుంచి 4.45 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని 1,389 పాఠశాలల్లో పరీక్షలు సజావుగా ప్రారంభమైనట్లు జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ మోహన్‌ తెలిపారు. ఎస్‌సీఈఆర్టీ రూపొందించిన ప్రశ్నా పత్రాలతోనే ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని స్కూళ్లలో పరీక్షలు నిర్వహించారు. సబ్జెక్టు టీచర్లు ఎప్పటికప్పుడు జవాబు పత్రాలను మూల్యాంకనం పూర్తి చేసేలా ప్రధానోపాధ్యాయులు తగిన శ్రద్ధ తీసుకోవాలని డీఈవో ఎల్‌.చంద్రకళ సూచించారు. ప్రైవేటు స్కూళ్లలోనూ తప్పనిసరిగా టైంటేబుల్‌ మేరకు పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు