అప్పన్న ఆర్జిత సేవలు పునరుద్ధరణ

29 Nov, 2023 01:24 IST|Sakshi
కంకణధారణ ఘట్టాన్ని నిర్వహిస్తున్న అర్చకుడు

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆర్జిత సేవలను మంగళవారం నుంచి పునరుద్ధరించారు. తిరునక్షత్రం పూజలు సందర్భంగా ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. తిరునక్షత్రం పూజలు ముగియడంతో తిరిగి ఆర్జిత సేవలు పునరుద్ధరించారు. మంగళవారం ఉదయం నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను మండపంలో వేంజేపచేసి విష్వక్సేణపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, సంకల్పం, యజ్ఞోపవీతం, జీలకర్రబెళ్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని అర్చకులు అందజేశారు.

మరిన్ని వార్తలు