రాజకీయ లబ్ది కోసమే లోకేశ్‌ ఆరాటం

24 May, 2021 19:30 IST|Sakshi

లోకేశ్‌పై మంత్రి అవంతి విమర్శలు

విశాఖపట్నం: రాజకీయ లబ్ధికోసమే డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. చంద్రబాబు హయంలోనే దళితులు ఉచకోతకు గురయ్యారని మంత్రి ఆరోపించారు.   దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ హేళనగా మాట్లాడిన చరిత్ర చంద్రబాబుదే అని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని కూడా చంద్రబాబు నాయుడు చిత్రహింసలకు గురి చేశారని మంత్రి వివరించారు. ఈ రోజు చంద్రబాబుకు అన్నీ వర్గాలు దూరమయ్యాయన్నారు. 


ఇదేం సంస్కారం
ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని శాడిస్టు అంటూ లోకేశ్‌ విమర్శిస్తున్నారు, తన కొడుక్కి చంద్రబాబు నేర్పిన సంస్కారం , మర్యాదా ఇదేనా అంటూ మంత్రి అవంతి ప్రశ్నించారు. ఇకపై సీఎం జగన్‌పై విమర్శలు చేసేప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ లోకేశ్‌పై  మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రికొడుకులిద్దరు ప్రభుత్వంపై కుట్రలు చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ మంత్రి ధ్వజమెత్తారు. 

Read latest Visakhapatnam News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు