సాహితీ చైతన్యోత్సవం పోటీల విజేతలు వీరే..

12 Nov, 2023 00:28 IST|Sakshi

విజయనగరం టౌన్‌: నగరంలో ఈ నెల 6వ తేదీన నిర్వహించిన గురజాడ సాహితీ చైతనోత్సవం సందర్భంగా చేపట్టిన పలు పోటీల్లో గెలుపొందిన వారి వివరాలను నిర్వాహకులు శనివారం వెల్లడించారు. విజేతలకు డిసెంబరు 3వ తేదీన సినీ గేయరచయిత చంద్రబోస్‌ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు గురజాడ సాంస్కృతిక సమైక్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్‌ తెలిపారు. వక్తృత్వ పోటీల్లో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కై వసం చేసుకున్న వారిలో ఎస్‌.వి.శేషాచార్యులు(పదో తరగతి, ఆదర్శ పాఠశాల, మదనాపురం), ఎస్‌.ఆశాభవాని(ఏడో తరగతి, గురజాడ స్కూల్‌, విజయనగరం), చరిత (పదో తరగతి, సన్‌ స్కూల్‌, విజయనగరం) ఉన్నారు. ఎం.ప్రణవ్‌(ఆరో తరగతి, సన్‌ స్కూల్‌, విజయనగరం), ఎం.సుచరిత (తొమ్మిదో తరగతి శ్రీచలపతి స్కూల్‌, విజయనగరం) కన్సొలేషన్‌ బహుమతులకు ఎంపికయ్యారు. జూనియర్స్‌ విభాగంలో జరిగిన పద్యపఠనం పోటీల్లో ప్రథమ బహుమతి కె.సాయి అక్షయశ్రీ(ఆరో తరగతి, సన్‌ స్కూల్‌, విజయనగరం), ద్వితీయ బహుమతి ఎం.గుణశేఖర్‌(ఏడో తరగతి, ఆదర్శ పాఠశాల, మదనాపురం), తృతీయ బహుమతి జి.వి.ఎల్‌.కామేశ్వరి( ఆరో తరగతి, గురజాడ స్కూల్‌, విజయనగరం) సాధించగా, కన్సొలేషన్‌ బహుమతులకు తనుశ్రీ(ఆరో తరగతి, విజ్ఞానభారతి, విజయనగరం), బి.భార్గవి(ఆరో తరగతి, జెడ్పీ ఉన్నత పాఠశాల, అలుగోలు), వి.నందగోపాల్‌(ఏడో తరగతి, సెయింట్‌ మారిస్‌ స్కూల్‌, విజయనగరం), ఎం.జశ్వంత్‌(ఆరో తరగతి, నారాయణ పబ్లిక్‌ స్కూల్‌, విజయనగరం), ధన వర్షిత(ఆరో తరగతి, నేషనల్‌ స్కూల్‌, విజయనగరం) ఎంపికయ్యారు. సీనియర్స్‌ విభాగంలో జరిగిన పద్యపఠనం పోటీల్లో టి.తేజస్వి(ఎనిమిదో తరగతి, సెయింట్‌ మారిస్‌ స్కూల్‌, విజయనగరం), ఎన్‌.ఎస్‌.వి.మౌక్తిక(తొమ్మిదో తరగతి, ఫోర్ట్‌ సిటీ స్కూల్‌, విజయనగరం), బి.దేదీప్య(తొమ్మిదో తరగతి, ఫోర్ట్‌ సిటీ స్కూల్‌, విజయనగరం) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి బహుమతులు కై వసం చేసుకోగా, పి.ఎస్‌.వి.శేషాచార్యులు(పదో తరగతి, ఆదర్శ పాఠశాల, మదనాపురం), ఎం.హర్షవర్ధన్‌, జెడ్పీ ఉన్నత పాఠశాల, అలుగోలు) వి.త్రినయని(బీసెంట్‌ స్కూల్‌, విజయనగరం) కన్సొలేషన్‌ బహుమతులకు అర్హత సాధించారు. సీనియర్స్‌ విభాగంలో జరిగిన వ్యాసరచన పోటీల్లో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఆర్‌.అంజలి(ఎనిమిదో తరగతి, విజయనగరం), కె.లక్ష్మీ శ్రీవాణి(తొమ్మిదో తరగతి, గురజాడ స్కూల్‌, విజయనగరం), ఎ.ఝాన్సీలక్ష్మి(పదో తరగతి, ఆదర్శ పాఠశాల, మదనాపురం) నిలిచి, బహుమతులు పొందగా, బి.ద్రాక్షాయణి(తొమ్మిదో తరగతి, బీసెంట్‌ స్కూల్‌, విజయనగరం) వి.కామేశ్వరి సుప్రజ( తొమ్మిదో తరగతి, మహారాజా హైస్కూల్‌, విజయనగరం)లు కన్సొలేషన్‌ బహుమతులు పొందారు. జూనియర్‌ విభాగంలో జరిగిన వ్యాసరచన పోటీల్లో వై.తేజస్విని(ఆరో తరగతి, గురజాడ స్కూల్‌, విజయనగరం), జి.అమృత వర్షిణి(ఏడో తరగతి, విజయనగరం), పి.దీపాశ్రీ( ఏడో తరగతి, సన్‌ స్కూల్‌, విజయనగరం)లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచి, బహుమతులకు ఎంపిక కాగా, కన్సొలేషన్‌ బహుమతికి సీహెచ్‌ శ్రావణి(ఏడో తరగతి, ఆదర్శ పాఠశాల, మదనాపురం) ఎంపికై నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు