మార్షల్‌ ఆర్ట్స్‌లో విద్యార్థి సత్తా

12 Nov, 2023 00:28 IST|Sakshi
కోచ్‌ త్రినాధరావుతో నీలాంజినీప్రసాద్‌

కొత్తవలస: జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థి ములగపాక నీలాంజినీప్రసాద్‌ సత్తా చాటారు. మండలంలోని వీరభద్రపురం గ్రామ పంచాయతీ, ములగపాకలవానిపాలెం గ్రామానికి ఈయన ఈ నెల 7, 8, 9వ తేదీల్లో గోవాలో జరిగిన 37వ జాతీయ స్వై మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో 58 కేజీల విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి, బ్రాంజ్‌ మెడల్‌(రజత పతకం) సాధించినట్లు కోచ్‌ ఎం.త్రినాథరావు శనివారం తెలిపారు. ఈ పోటీల్లో 16 రాష్ట్రాల నుంచి మొత్తం 216 మంది పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 8 మంది పాల్గొన్నారన్నారు. ఈ మేరకు సదరు విద్యార్థి, కోచ్‌ను పలువురు అభినందించారు.

ఐఎన్‌ఐ సెట్‌లో మందరాడ వాసికి 155వ ర్యాంకు

రాజాం/సంతకవిటి: ఐఎన్‌ఐ(ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌) సెట్‌ ఫలితాల్లో సంతకవిటి మండలం, మందరాడ గ్రామానికి చెందిన వావిలపల్లి చంద్రమౌళి ఆలిండియా విభాగంలో 155వ ర్యాంకు సాధించారు. ఈ యువకుడు నవంబరు 5వ తేదీన జరిగిన మెడికల్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ రాయగా, శనివారం ఫలితాలు వెలువడ్డాయి. పీజీలో జనరల్‌ మెడిసిన్‌ కోర్సు చేసేందుకు గాను ఈ పరీక్ష రాసినట్లు చంద్రమౌళి తెలిపారు. ఈయన 2017లో జరిగిన నీట్‌లో ఆలిండియా విభాగంలో 508వ ర్యాంకు సాధించి, విశాఖ కేజీహెచ్‌లో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. తాజాగా ఐఎన్‌ఐ సెట్‌లో కూడా ప్రతిభ చాటడంతో అందరూ అతడిని అభినందిస్తున్నారు. ఈయన తల్లి భాగ్యలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయిని కాగా, తండ్రి శ్రీనివాసరావు వైఎస్సార్‌ క్రాంతి పథం శాఖలో సీసీగా పనిచేస్తున్నారు.

ప్రజలందరికీ దీపావళి

శుభాకాంక్షలు

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం రూరల్‌: జిల్లా ప్రజలకు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం దీపావళి పండగ పురస్కరించుకుని, విలేకరులతో శనివారం మాట్లాడిన ఆయన ఈ వెలుగుల పండగ ప్రతిఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి గెలిచిందన్న దానికి ప్రతీకగా చేసుకునే ఈ వేడుకలు అందరి ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసేలా చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు