బోనులో భల్లూకం

14 Nov, 2023 01:30 IST|Sakshi
యువతీ, యువకులు వేసిన పలు చిత్రాలు

మరుపల్లి కొండపై బంధించిన అటవీశాఖ సిబ్బంది

మెంటాడ: మండలంలోని మరుపల్లి కొండపై సంచరిస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ సిబ్బంది సోమవారం బంధించారు. వివరాల్లో కి వెళ్తే.. కొండపై ఎలుగుబంటి సంచరిస్తున్నట్టు స్థానిక రైతులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన కొండ వద్దకు చేరుకు ని తుప్పల్లో చిక్కుకున్న ఎలుగుబంటిని గుర్తించారు. మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి బోనులో బంధించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి ఎస్‌.వెంకటేష్‌ విలేకరులతో మాట్లాడుతూ కొండపై మరికొన్ని ఎలుగుబంట్లు ఉండే అవకాశం ఉందన్నారు. ఆహారం కోసం కొండ కిందకు దిగే క్రమంలో ఎలుగు కాళ్లకు తివ్వ చుట్టకోవడంతో తుప్పల్లో చిక్కుకుందని తెలిపారు. బంధించిన ఎలుగుబంటిని విశాఖప ట్నంలోని ఇందిరాగాంధీ జులాజికల్‌ పార్కుకు తరలించామన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ రేంజర్‌ అప్పలరాజు, డీఆర్వో ప్రహ్లాదరా జు, జూపార్కుకు వైద్యులు ఫణీంద్రతో పాటు పలువురు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

28న నెల్లిమర్లలో సామాజిక సాధికార బస్సుయాత్ర

సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు

నెల్లిమర్ల: మండల కేంద్రంలో ఈనెల 28న జరగనున్న సామాజిక సాధికార బస్సుయాత్ర ఏర్పాట్లను ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయు డు సోమవారం పరిశీలించారు. నగర పంచాయతీ నేతలతో కలిసి నెల్లిమర్ల పట్టణంలో సభాస్థలి ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నెల్లిమర్ల మండలంలో 30 వేల మందితో సామాజిక బస్సుయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ఈ బస్సుయాత్రలో నియోజకవర్గ ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, వైఎస్సార్‌సీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు, మండల అధ్యక్షుడు చనమల్లు వెంకటరమణ, నగర పంచాయతీ వైస్‌ చైర్మన్లు ఎస్‌. రామారావు, కేవీ కృష్ణారావు, డీఎస్పీ గోవిందరావు, సీఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

చిత్రాలతో భళా..!

సీతంపేట: గిరిజన విద్యార్థుల్లో సహజంగానే చిత్రలేఖనం, దస్తూరీలో మంచి ప్రతిభ ఉంటుంది. ఆకట్టుకునేలా బొమ్మలు గీస్తారు. అందమైన రాతతో ఆకట్టుకుంటారు. సీతంపేట ఐటీడీఏ ప్రోత్సాహంతో 20 మంది యువత సొసైటీగా ఏర్పడి చిత్రలేఖనంలో తమ ప్రతిభకు పదునుపెడుతున్నారు. ఆదిమ తెగలు నిర్వహించే వివిధ రకాల పండగలు, గిరిజను ల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, జీవన విధానాలను చిత్రాల రూపంలో నేటి తరానికి తెలియజేస్తు న్నారు. ప్రకృతిని ప్రతిబింబించే చిత్రాలను పట్టణాల్లో ప్రదర్శనగా ఉంచి విక్రయిస్తున్నా రు. ఒక్కో చిత్రపటం రూ.1000 నుంచి రూ. 2,000 వరకు అమ్ముడవుతుండడంతో కుంచెకు పనిచెబుతున్నారు. ఐటీడీఏ సాయంతో సీతంపేటలోని పీఎంఆర్‌సీ పాత భవనాల్లో ఒక రూమ్‌లో బొమ్మలు వేస్తున్నారు. ఇటీవల సీతంపేటతో పాటు పలు ప్రాంతాల్లో వైకేపీ, జీసీసీ ఆద్వర్యంలో ట్రైఫెడ్‌ నిర్వహించిన ఎగ్జిబిషన్లో తమ చిత్రాలను ప్రదర్శించారు. విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకు ళం తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్టాల్స్‌లో చిత్రాలను ప్రదర్శిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నారు.

మరిన్ని వార్తలు