నేడు జిల్లా ఫెన్సింగ్‌ క్రీడాకారుల ఎంపిక

3 Dec, 2023 01:06 IST|Sakshi

విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న ఫెన్సింగ్‌ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం నిర్వహించనున్నట్టు జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి డి.వి.చారిప్రసాద్‌ శనివారం తెలిపారు. నగరంలోని విజ్జీ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించే సబ్‌ జూనియర్స్‌, కేడిట్‌ విభాగాల్లో ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఎంపిక పోటీల్లో క్రీడాకారుల గుర్తింపు కార్డు, ఆధార్‌, జనన ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలన్నారు. ఆ రోజు జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిథ్యం వహిస్తారని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనాలని కోరారు.

మరిన్ని వార్తలు