అన్నింటా ప్రోత్సాహం

3 Dec, 2023 01:06 IST|Sakshi
ఫిజియో థెరపీ చేస్తున్న వైద్యురాలు

రామభద్రపురం: దివ్యాంగుల సంక్షేమానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. వివిధ సంక్షేమ పథకాల కింద ఆర్థిక తోడ్పాటుతో పాటు ఊరూరా వైద్యశిబిరాలు నిర్వహించి అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తోంది. ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రమాణాలతో కూడిన విద్యను బోధించేందుకు శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించింది. వారి ‘భవిత’కు గట్టి పునాది వేస్తోంది. దివ్యాంగులకు నెలనెలా ఠంచన్‌గా పింఛన్‌తో పాటు వైద్యసేవలను ఉచితంగా అందిస్తోంది. జీవన భరోసా కల్పిస్తోంది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబర్‌–3) సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఓ సారి పరికిద్దాం.

అన్నింటా ప్రోత్సాహం

ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ఉజ్వల భవితను అందించేందుకు జిల్లాలో ఉన్న 27 భవిత కేంద్రాలను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బలోపేతం చేసింది. అందులో ప్రస్తుతం చదువుతున్న 539 మంది దివ్యాంగ పిల్లలకు ప్రమాణాలతో కూడిన విద్యాబోధనకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించింది. భవిత కేంద్రాల్లో పిల్లల వైకల్యం నిర్ధారణ, పూర్వ ప్రాథమిక దశలో ఉన్న సమస్య గుర్తింపు, ఉచిత ఉపకరణాల పంపిణీ, ఇంటి వద్దనే విద్య, చిన్నపాటి శస్త్ర చికిత్సలకు సహకారం, పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తోంది. ఫిజియో థెరిపీ, స్పీచ్‌ థెరిపీ, దృష్టిప్రేరణ విద్యాబోధన, బ్రెయిలీలిపి వంటి సేవంలందిస్తూ వివిధ లోపాలతో జన్మించిన పిల్లల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తోంది. భవిత కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ట్రాన్స్‌పోర్ట్‌, ఎస్కార్ట్‌ అల

ఆర్థిక తోడ్పాటు

దివ్యాంగులు వివిధ యూనిట్లు ఏర్పాటుకు రాయితీతో కూడిన రుణాలతో పాటు, నెలనెలా రూ.3000 చొప్పున ఠంచన్‌గా ప్రభుత్వం పింఛన్‌ అందిస్తోంది. దివ్యాంగుల ఆర్థిక ఎదుగుదలకు సహకరిస్తోంది.

మరిన్ని వార్తలు