లారీ ఢీకొని వ్యక్తి మృతి

3 Dec, 2023 01:06 IST|Sakshi
నరవ పోలింగ్‌ కేంద్రంలో బీఎల్‌ఓతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

బొండపల్లి: మండలంలోని గొట్లాం గ్రామానికి సమీపంలో జాతీయ రహదారి–26పై శనివారం సైకిల్‌పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. ఎస్‌ఐ ఎస్‌.రవి తెలిపిన వివరాల ప్రకారం.. గొట్లాం గ్రామానికి చెందిన తాళ్లపూడి బుచ్చినాయుడు(55) సైకిల్‌పై గొట్లాం బైపాస్‌ రోడ్డు నుంచి ఇంటికి వస్తుండగా అక్కడకు సమీపంలోని ఽగ్రాండ్‌ఫుడ్‌ కోర్టు దాబాకు దగ్గరలో పార్వతీపురం వైపు నుంచి విజయనగరం వైపు వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. తీవ్రగాయాలపాలైన ఆయన అక్కడిక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య లక్ష్మితో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించామన్నారు.

ఓటర్ల నమోదుకు ప్రత్యేక శ్రద్ధ

గంట్యాడ: యువ ఓటర్ల నమోదుపై బీఎల్‌ఓ(బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌)లు దృష్టి సారించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. మండంలోని రామవరం, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, నరవ ఎంపీయూపీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు. బీఎల్‌ఓల రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఫారం–6, 7, 8లను పరిశీలించి, 18 ఏళ్లు దాటిని ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని బీఎల్‌ఓ సర్వే చేయాలన్నారు. మరణించిన వారి ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చి పేర్లు తొలిగించాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్‌ పి.నీలకంఠేశ్వరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ సతీష్‌ ఉన్నారు.

అంగన్‌వాడీ పోస్టుల భర్తీ

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న ఒక అంగన్‌వాడీ కార్యకర్త, రెండు అంగన్‌వాడీ సహాయకుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు మహిళా శిశు సంక్షేమ, సాధికారిత అధికారి ఎం.ఎన్‌.రాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వివాహితులు ఈనెల 5 నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో దరఖా స్తులు అందజేయాలన్నారు.

మరిన్ని వార్తలు