అండర్‌–19 క్రికెట్‌ పోటీలకు జిల్లా బాలుర జట్టు

3 Dec, 2023 01:06 IST|Sakshi
విజయవాడలో క్రికెట్‌ పోటీలకు బయలుదేరిన జిల్లా అండర్‌–19 స్కూల్‌గేమ్స్‌ జట్టు

విజయనగరం: విద్యార్థి దశలో క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న అండర్‌–19 స్కూల్‌గేమ్స్‌ క్రికెట్‌ పోటీలకు జిల్లా బాలుర జట్టు శనివారం పయనమైంది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు విజయవాడలో జరగనున్న పోటీల్లో జిల్లా నుంచి 14 మంది క్రీడాకారుల బృందం ప్రాతినిథ్యం వహించనుంది. క్రీడాకారులను అండర్‌–19 స్కూల్‌గేమ్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పీవీఎల్‌ఎన్‌ కృష్ణ అభినందించి పలు సూచనలు సలహాలు చేశారు. కార్యక్రమంలో పలువురు పీడీలు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

నేటి నుంచి విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలు

మరిన్ని వార్తలు