తుపానుపై అప్రమత్తంగా ఉండాలి

3 Dec, 2023 01:06 IST|Sakshi

ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర

సాలూరు: వాతావరణ శాఖ తుపాను హెచ్చరికల నేపథ్యంలో పార్వతీపురంమన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, అధికారులు, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర సూచించారు. సచివాలయాలు, ఆర్‌బీకేల్లో పనిచేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు, ఉద్యోగులు వలంటీర్లతో రైతులను, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కోసిన వరి చేనును కుప్పల పెట్టించడం, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, టార్పాలిన్లతో పంటలను రక్షించుకునే చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 6న తుపాను తీరందాటేవరకు పంటలు కోయవద్దన్నారు.

రేపటి నుంచి ‘మిచాంగ్‌’ ప్రభావం

జేసీ మయూర్‌ అశోక్‌

విజయనగరం అర్బన్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావం జిల్లాలో ఈ నెల 4 నుంచి 6వ తేదీ మధ్యలో ఉంటుందని జేసీ కె. మయూర్‌ అశోక్‌ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలని, నూర్పిడి చేసిన పంటను సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించారు. పత్తి పంట రెండో ఏరివేతకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వెంటనే ఏరివేయాలన్నారు.

మరిన్ని వార్తలు